
పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను భక్తి శ్రద్దలతో దర్శనం చేసుకున్న నీకు సంతోషమేనా శబరి – భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
- రాష్ట్రంలో గుడ్ వర్కర్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్నూలులో సూపర్ జీ ఎస్టీ, సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ, శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్ల దర్శనం కోసం గురువారం వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నంద్యాల జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయంలో ఉదయం స్వాగతం సమయంలో, సాయంత్రం వీడ్కోలు సమయంలో శబరి,శబరి అంటూ ప్రత్యేకంగా పలకరింపుతో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యేక ఆకర్షణగా విమానాశ్రయంలో నిలిచారు.కర్నూలు పర్యటనలో ఓర్వకల్లు విమానాశ్రయంలో ప్రధానమంత్రి కీ స్వాగతం పలికే సమయంలో రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, తదితర రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే లను, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిచయం చేసే సమయంలో శబరి ఎక్కడ అంటుండగా ప్రధాని అనగానే ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మోదీజీ మీరూ ఎలా ఉన్నారు అంటుండగా సీఎం చంద్రబాబు ఆమె మన నంద్యాల ఎంపీ అనగానే ప్రధాని మోడీ వెంటనే స్పందించి అవును నాకు తెలుసు, ఆమె నన్ను పార్లమెంట్ లో పలుమార్లు శ్రీశైలం రమ్మని పిలిచారు. శబరి వల్లే నేను శ్రీశైలం వచ్చాను, శబరి మీకు నా ఆశీస్సులు అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని దీవించారు.శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దర్శనం, శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకొని, కర్నూలు వద్ద సూపర్ జీ ఎస్టీ- సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభ విజయవంతం అనంతరం ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ఓర్వకల్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వీడ్కోలు పలికే సమయంలో మళ్ళీ ప్రధాని మోడీ శబరి ఎక్కడ అంటూ మంత్రుల తర్వాత నిలిచిన బైరెడ్డి శబరి వద్దకే చేతులు ఊపుతూ ప్రధాని వెళ్లి శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లను భక్తి శ్రద్దలతో దర్శనం చేసుకున్నా, శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రంలో ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నా నీకు సంతోషమేనా అంటుండగానే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎంపీ బైరెడ్డి శబరి గుడ్ వర్కర్ అనగానే ప్రధానమంత్రి మోడీ నాకు తెలుసు, డైనమిక లీడర్ శబరి అంటూ భారత ప్రధానమంత్రి కితాబ్ ఇచ్చారు.