
ప్రభుత్వాలు ఆదివాసీ గూడాలను గాలికి వదిలేస్తున్నాయి.
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2
అల్లూరి సీతారామరాజు జిల్లా ,చింతూరు మండలం పేగ పంచాయతీ పరిధిలో గల కల్లిగుండ, పుంగుట్ట గ్రామాలు పడుతున్న కష్టాలు ఇంత అంత కాదు, వర్షాకాలం లో ఆస్పత్రులకు , నిత్యవసర సరుకుల కోసం చంద్ర వంక వాగు దాటాల్సిందే, ఈ వర్షాల సమయంలో రోగులను హాస్పత్రులకు తీసుకెళ్లడానికి వేరే మార్గమేమీ లేదు , వరదలు ఎక్కువైతే దేవుడు మీద భారం పెట్టి ఉండాల్సిన పరిస్థితులు ఈ రెండు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం ఆదివాసీల పై చిత్తశుధ్ధి ఉంటే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గోండ్వానా సాంస్కృతిక అధ్యయన కేంద్రం గోటుల్ కో ఆర్డినేటర్ శ్రీను సోడే డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాతీయ జెండా గర్వంగా ఎగురవేసి స్వాతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నాం కానీ మా ఆదివాసీలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు రోడ్డు, విద్య , వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారన్నారు,గత రెండు సంవత్సరాల క్రితం కల్లిగుండ గ్రామానికి చెందిన యువకుడు కుంజా సతీష్ జ్వరం వచ్చి అత్యవసర పరిస్థితిలో వెంటనే ఆస్పత్రికి తీసుకు వెళ్ళడానికి చంద్రవంక వాగు దాటలేక మరొక రోజు ఆగి ఆస్పత్రికి చేర్చడంతో మరణించడం జరిగిందీ .ఇలా ఎన్నో ప్రాణాలు పోతున్నాయి.ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటే పరిస్థితి నెలకొంది , ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మార్చే ప్రభుత్వాలు లేవు ,ఉచితాలు కాదు ఇవ్వాల్సింది మా కష్టాలను తీర్చండి అని అడుగుతున్నామన్నారు.
