
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ ఇంచార్జ్ జూలై 24
స్వాతంత్ర సమరయోధుడు కేవలం గిరిజన నాయకుడు మాత్రమే కాదని భారత స్వాతంత్ర పోరాట యోధుడు అని అతనిని గిరిజన నాయకుడిగా చూసి కొంతమంది యువకులు అతన్ని విగ్రహ ధ్వంసం చేయడం బాధాకరమని భీమవరం కూనవరం కి చెందిన కొంతమంది విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని బిజెపి సీనియర్ నాయకులు పాయం.వెంకయ్య మండల అధ్యక్షులు కరక పవన్ కుమార్ పార్టీ సీనియర్ నాయకులు కారం .ధారయ డిమాండ్ చేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు గిరిజన సంఘం జెండాని ద్వంసం చేయటం గిరిజన ప్రజల ఆరాధ్య దైవాన్ని ( కొమరం భీమ్) విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఒక కుట్రలో భాగమని బిజెపి నాయకులు ఆరోపించారు కోతుల గుట్ట భీమవరం గ్రామాలలో ఒక సామాజిక తరగతికి చెందిన వారు రోడ్డుకు ఇరువైపులా భూములు ఆక్రమించుకుని ఉన్నారు వారికి విగ్రహం అడ్డు వస్తున్నందుకు అరాచక శక్తులతో కుట్రలు చేసి ఆదివాసి ప్రజలను రెచ్చగొట్టడంలో భాగంగా ఆదివాసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటంలో భాగంగా ఈ దాడి జరిగి ఉంటుందని దీనిని పూర్తిగా విచారించాలనీ బిజెపి నాయకులు ఒక ప్రత్యేక ప్రకటనలో డిమాండ్ చేశారు