
జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు…
అన్న సంతర్పణకు 6 క్వింటాళ్ల బియ్యాన్ని అందజేసిన అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ ….
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 13:-రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం పంచాయితీ తూర్పుపాలెంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల 31 వ కల్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలు, పుష్పఆర్చనలు చేసి, నైవేద్యాలు సమర్పించి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ తిరునాళ్ల మహోత్సవంలో చిన్న పెద్ద తేడా లేకుండా భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.. తిరునాళ్ల మహోత్సవానికి.. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు… విచ్చేసి స్వామి అమ్మవార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి బాపట్ల అఖండ పౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ 6 క్వింటాళ్ల బియ్యం అందజేశారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం లో పాల్గొనడం నా జన్మ ధన్యమైందని అన్నారు. సేవా సంస్థను స్థాపించి ఆపదలో ఉన్న వారికి నేనున్నానని భరోసా కల్పిస్తూ ఎందరికో ఫౌండేషన్ ద్వారా సాయ సహకారాలు అందిస్తు, అలాగే నియోజకవర్గ దేవాలయాలలో జరిగే అన్న సంతర్పణకు సహకరిస్తున్న అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ ను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అభినందించారు.. ఆలయం వద్ద 4 వేల మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంను జనసేన నాయకులు తులసి కుమారి, మాధురి, గ్రామ సర్పంచ్ పీఠా శ్రీనివాసరావు, ఏనుగు వెంకయ్య, తన్నీరు కృష్ణమూర్తి, తోట శివరామ కృష్ణమూర్తి, రౌతు సుబ్బారావు, పెదమల్లు ఉదయచంద్రరావు తదితరులు పర్యవేక్షించారు.