పయనించేసూర్యుడు/జనవరి 12/కాప్రా ప్రతినిధి సింగం రాజు: స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాల సందర్భంగా మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ లో హెచ్ బి కాలనీ ఫేస్-1 ప్రధాన కూడలిలో గల ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్,మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ లేవండి, మేల్కోండి,గమ్యం చేరే వరకూ విశ్రమించకండి అని యువతకు స్ఫూర్తినిచ్చిన ఆధునిక భారతీయ మునీశ్వరుడు,మరుగున పడిన భారతీయ సంస్కృతి మరియు ధర్మాల యొక్క తేజస్సును ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పిన గొప్ప మహనీయులు అని శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్బంగా వారికి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో నర్సింహ రావు, ఎనుముల మహేష్, రాంప్రదీప్,పి.బ్రహ్మచారి, పసునూరి బ్రహ్మచారి, ఉల్లెం బాలరాజు,గడియారం రామకృష్ణ, కృష్ణమూర్తి, అశోక్, నవీన్ గౌడ్, కుమార్, లింగం, చారి,బాలయ్య గౌడ్,మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.