Saturday, February 1, 2025
HomeUncategorizedహంద్రీనీవా కాలువ‌ పనులు పరిశీలించిన మంత్రి సవితమ్మ

హంద్రీనీవా కాలువ‌ పనులు పరిశీలించిన మంత్రి సవితమ్మ

Listen to this article

నియోజకవర్గంలో ని అన్ని చెరువులకు సాగునీరందేలా చ‌ర్య‌లు

———–కాలువల మరమ్మతులు వెంటనే పూర్తి చేయండి అధికారులకు ఆదేశించిన మంత్రి సవిత

పయనించే సూర్యుడు జనవరి 30 (గోరంట్ల మండల ప్రతినిధి పక్రోద్దీన్) శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ..కూటమి ప్ర‌భుత్వం ఏర్పాటైన నుంచి పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో రైతన్న‌ల‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా వారికి చేదోడువాదోడుగా నిలుస్తూ వారికి అన్నివిధాలా అండ‌గా నిలుస్తున్న మంత్రి సవితమ్మ . రొద్దం మండలం బొక్సంపల్లి సబ్ స్టేషన్ వద్ద ఉన్న హెచ్ న్ ఎస్ఎస్ మడకశిర బ్రాంచ్ కెనాల్ ప్రధాన కాల్వను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి సవితమ్మ కాలువ పూర్తిగా పూడిక‌లతో నిండిపోయింది. కాలువ పనులు పూర్తీ అయ్యితే పెనుకొండ నియోజకవర్గంలోని చెరువులతోపాటు హిందూపురం ,మడకశిర నియోజకవర్గంలో ని చెరువుల కూడా నీరు వెళుతుందని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మ్మమాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో వైసిపి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేసారని,రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని ,రైతులకు సాగునీ రు,అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంమని గొల్లపల్లి రిజర్వాయర్ రాకతో వేలాది ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నామని, తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌ధాన కాలువ‌ల‌తో పాటు పిల్ల‌కాలువ‌ల్లోని పూడిక‌లు తొల‌గించి రైతుల కళ్లల్లో ఆనందం నింపామ‌న్నారు. రైతుల సంక్షేమ‌మే కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు. అన్నదాతకే మొదటి ప్రాధాన్యం అని చెప్పిన వైసీపీ ప్ర‌భుత్వం అన్న‌దాత వెన్ను విరిచింద‌న్నారు. గ‌త ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది త‌ప్ప అదంతా చేతల్లో కనిపించడం లేదని విమ‌ర్శించారు .నిజంగా రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి కాలువల్లో పూడికతీతే ప‌నులు చేయ‌క‌పోవ‌డ‌మే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. రైతుల క‌ష్టాలు తెలిసిన సీఎం చంద్ర‌బాబునాయుడు రైతులకు ఎప్పుడూ అండ‌గా ఉంటార‌ని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments