
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // హుజురాబాద్ అర్ సి)
వీణవంక మండల కేంద్రంలో వివిధ గ్రామాల్లో పని చేస్తున్న బజార్, సిమెంటు ,ఫర్టిలైజర్ ఐకెపి , మేల్ ,ఫిమేల్ వరిదాన్యం ,మక్కలు, ఐరన్, ఎగుమతులు దిగుమతులు సంబంధించిన, కూలీరేట్లను ప్రస్తుతం ఇస్తున్న దానిపై అదనంగా 20% పెంచి ఇచ్చుటకు పలు దఫాలుగా మండల వర్తక, వ్యాపారా యజమాన్యాలు మరియు రైతులు హమాలీ సంఘం పెద్దమనిషులు సిఐటియు యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో పలు దఫాలుగా చర్చలు జరిపి, ఇరు వర్గాలకి ఆమోదయోగంగా ఈ యొక్క ఒప్పందం రెండు సంవత్సరాలు అమాల్లో ఉంటుందని చేయడం జరిగినది. ఈ యొక్క ఒప్పందం ప్రకారం అన్ని గ్రామాలలో హమాలీలు లిస్టు ప్రకారం రేట్లు తీసుకోవాలని, కొన్నిచోట్ల ఉల్లంఘించి రైతుల వద్ద అధిక రేట్లు తీసుకున్నట్లయితే, దీనికి యూనియన్ వారిపై తీసుకునే చర్యకు కట్టుబడి ఉండాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, హమాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు పిల్లి రవి యాదవ్, మండల కార్యదర్శి మరియు వర్తక పెద్దలు కే రాజశేఖర్, ఏ రాంబాబు, కే శ్రీనివాస్, కే లక్ష్మయ్య, కెపున్నం, కే రమేష్, ఏం వీరేందర్ రెడ్డి, ఎం మధుకర్ రెడ్డి, ఎం శ్రీనివాస్, జి నారాయణ, ఎండి ఫారుక్, ఎం సదయ్య హమాలి నాయకులు మర్రి రవీందర్, మంత్రి రవీందర్. ఏం శంకర్, తదితరులు పాల్గొన్నారు.