
రుద్రూర్, అక్టోబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలో హమాలీ కార్మికుల కోసం హమాలి భవన్ కు స్థలం కేటాయించాలని హమాలి యూనియన్ రుద్రూర్ మండల కన్వీనర్ బందేల భీమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రుద్రూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 50 ఏండ్లు నిండిన హమాలీ కార్మికులకు నెలకు రూ. 5వేలు పెన్షన్ ఇవ్వాలని భీమయ్య కోరారు. లేకపోతే హమాలీ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో హమాలీ యూనియన్ నాయకులు మహబూబ్, గంగాధర్, ఎర్రన్న లక్ష్మణ్, భూమయ్య, రాములు, గంగారం, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.