
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మూడవ మహాసభను జయ ప్రదం చేద్దాం.
టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ పిలుపు
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
జర్నలిస్టుల ఐక్యతను,వృత్తి గౌరవాన్ని మరింత బలపరచాలంటే సంఘటితంగా ఉండాలని టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ కార్యదర్షి నరేష్ అన్నారు. షాద్ నగర్ పట్టణ కేంద్రంలోని సమావేశాన్ని నిర్వహించారు.జర్నలిస్టుల సమస్యలు,భవిష్యత్తు సంక్షేమ పథకాలు,నైతిక విలువల పరిరక్షణలపై చర్చకు వేదికగా నిలుస్తుంది.జర్నలిస్టుల సమస్యలు..జర్నలిస్టుల భద్రత మరియు హక్కులు,వేతనాల సమర్థత మరియు ఉద్యోగ భద్రత,వృత్తి నైతికత మరియు సమాజంపై బాధ్యతల పరిరక్షణ,తదితర అంశాలను చర్చించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలునిస్తున్నారు.హలో జర్నలిస్టు… చలో కందుకూరు..అంటూ జర్నలిస్టులందరినీ సమూహబద్ధంగా పాల్గొన్నారు.మన ఐక్యతను,శక్తిని చాటుదామని పిలుపునిచ్చారు.మహాసభలో పాల్గొనడం ద్వారా జర్నలిస్టులు తమ సమస్యలను సమగ్రంగా చర్చించుకోవచ్చు.ప్రభుత్వ ప్రతినిధుల ముందు వృత్తి పరిస్థితులను ముందుగా తెలియజేయవచ్చును.జర్నలిస్టుల ఐక్యతే వారి శక్తి,ఈ మహాసభలో పాల్గొని సమస్యలపై ఏకమై మాట్లాడితే, భవిష్యత్తులో వృత్తి మరింత బలపడుతుంది.
ఈ సమావేశంలో టీ డబ్ల్యూ జె ఎఫ్ కార్యదర్షి డివిజన్ నరేష్, టీ డబ్ల్యూ జె ఎఫ్ నాయకులు రాకేష్, భైరమోని మహేష్, సాయి నాథ్ రెడ్డి, ఇక్కబల్, కృష్ణ, ఎస్బి బాలు, దిర్శనం శంకర్,వానరసి జగన్, రవి తేజ,మల్లేష్, నరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
