వెయ్యి గొంతులు లక్ష డప్పులు” ప్రదర్శన మాదిగల ఆత్మగౌరవం సూచిక.
మండలానికి చేరిన ప్రచార రథయాత్ర*
*పయనించేసూర్యుడు: జనవరి 13: ములుగు జిల్లావాజేడు మండల ప్రతినిధి: రామ్మూర్తి.ఎ.
వాజేడు:ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగల చైతన్య రథయాత్ర కొనసాగింది
మహాజన నేత మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ “వెయ్యి గొంతులు లక్ష డప్పులు” మాదిగల మహా సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాంస్కృతిక చైతన్య రథయాత్ర ములుగు జిల్లాలో వెంకటాపురం(నూగూరు) నుండి మొదలై వాజేడు, ఏటూరునాగారం మీదుగా మంగపేట మండలానికి చేరుకుంది..
30 సంవత్సరాల వర్గీకరణ పోరాటం చివరి సమయంలో అమలు కోసం మరొక ఆత్మగౌరవ పోరాటం చేయాలనీ, 59 కులాలకు సమాన హక్కులు సామాజిక న్యాయం కోసం ప్రతి మాదిగబిడ్డ ఇంటికో డప్పుతో కదలాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో MSP జాతీయ నాయకులు ఇరుగు పైడి మాదిగ,
కళా నాయకులు రాష్ట్ర కోఆర్డినేటర్ గోల్కొండ బుచ్చన్న, MSPములుగు జిల్లా అధ్యక్షులు మడిపల్లి శ్యాంబాబు మాదిగ, వెయ్యిగొంతులు లక్షడప్పులు ములుగు జిల్లా అధ్యక్షులు రేలా కుమార్, ప్రధాన కార్యదర్శి ఇనుముల రమేష్ పొలేపాక యకయ్య, రాగుల శంకర్, మోతే రమేష్. మందపెల్లి నవీన్,
మంగపేట మండల ఇంచార్జీ ఎంపెల్లి శంకర్ మాదిగ, MRPS జిల్లా నాయకులు గుగ్గిల్ల సురేష్ మాదిగ , జిల్లా నాయకులు ఈసంపెల్లి సురేందర్ మాదిగ , LP శ్రీను మాదిగ , మండల నాయకులు మరియు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.