
పయనించే సూర్యుడు అక్టోబర్ 14 , నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
- దేవాళయాల జోలికి వెళ్ళకండి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జోక్యం తో రైల్వే స్టేషన్ సమీపంలో సద్ధుమణిగిన ఆలయాల సమస్య హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి, ఆలయాల జోలికి వెళ్ళకండి, ఎవరూ ఫిర్యాదు చేయకున్నా ఆలయాల పైకప్పు ఎలా తొలగిస్తారు, బాటసారులకు ఇబ్బంది లేకుండా ఉన్న సమూహా ఆలయాలు తొలగించాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది, దేవుళ్ళకు నిత్యం సేవచేసే ప్రభుత్వ ఉద్యోగి టీచర్ నారాయణను రైల్వే స్టేషన్ లో ఒక రోజంతా ఎలా నిర్భందిస్తారు,అంటూ రైల్వే అధికారులను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఫోన్ ద్వారా క్లాస్ పీకారు.మంగళవారం నంద్యాల రైల్వే స్టేషన్ కు నూనెపల్లి నుంచి వచ్చే రహదారి పక్కన ఉన్న వినాయక గుడి, నాగుల కట్ట శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యం స్వామి, పరమేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వరస్వామి, సాయిబాబా, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ రాఘవేంద్ర స్వామి, నవగ్రహ చిన్న మండపాలు పూర్వం నుంచి ఏర్పాటు చేసుకొని మూలసాగరం, నూనెపల్లి, సాయిబాబా నగర్, ఎం ఎస్ నగర్, తదితర కాలనీల భక్తులు పూజలు చేసూకుంటూ తమ మొక్కుబడులు తీర్చుకీంటున్నారు.ప్రభుత్వ ఉపాధ్యాయుడు నారాయణ, వారి మిత్ర బృందం ఈ సామూహిక చిరు ఆలయాల్లో ప్రతి పండుగ ఘనంగా జరుపుకొని అటు వెళ్లే బాటసారులకు అన్న ప్రసాద వితరణ చేస్తూ వస్తున్నారు. ఉన్నట్టుండి నంద్యాల రైల్వే డివిజనల్ ఓ అధికారీ ఇక్కడ ఈ ఆలయాల గోల ఎలా, వెంటనే వాటిని తీసివేయండి అంటూ నంద్యాల రైల్వే పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం, సోమవారం రాత్రి ఆలయాల పర్యవేక్షకుడు నారాయణను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని ఆలయాలపై ఉన్న రేకులు ఉటాహుటిన తొలగించారు.ఇది తెలుసుకున్న నూనెపల్లి, మూలసాగరం, రైల్వే స్టేషన్ ప్రాంతం లోని కాలనీల ప్రజలు, హిందూసంఘాల ప్రతినిధులు సుమారు మూడు వందల మంది ఆలయాల వద్దకు చేరుకొని ఎవరికీ ఇబ్బంది లేని మా ఆలయాలు ఎందుకు తొలగిస్తున్నారని రైల్వే పోలీసులు, అధికారులతో వాదనకు దిగారు.రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్. పి.నవీన్ గౌడ్, చింతలపల్లి వాసు తదితరులు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ఫోన్ ద్వారా సమస్య తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రైల్వే అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, దేశ ప్రధాని నంద్యాల జిల్లాకు వస్తున్న సమయంలో ఇలాంటి సరైనవి కాదని, భక్తుల మనోభావాలు కాపాడాలని, తొలగించిన రేకుల షెడ్ వెంటనే వేయాలనీ, పూర్వం నుంచి ఉన్న ఆలయాలు అలాగే యధావిధిగా ఉండేలా రైల్వే అధికారులు చూడాలని కోరడంతో రైల్వే అధికారులు వెనక్కు వెళ్లడంతో సమస్య సద్ధుమణిగింది.దీంతో హిందూ సంఘాల ప్రతినిధులు కౌన్సిలర్ ఖండే శ్యాంసుందర్ లాల్, చింతలపల్లి వాసు, శేష సాయి, రంగస్థల కళాకారుడు శివరామిరెడ్డి, కన్నయ్య, బసవరాజు, రాం ప్రసాద్, నాగదీప్, నాగభూషణం, చందు తదితరులు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరికి ధన్యవాదములు చెప్పారు.


