
పయనించే సూర్యుడు ఏప్రిల్ 7 నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూరు: హిందూ ధర్మం ఎంతో గొప్పదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం వేల్పూర్ లో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష (అన్నదానం) ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని జంబియన్ ఆలయం వద్ద దీక్ష సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ దీక్ష భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… సకల కోటి మానవాళి రక్షణ కోసం, మన అందరికి కోసం, పక్కవాడికి కూడా నష్టం చేయకుండా ఉండటానికి ఆదుకునే దిశలో మన దాంట్లో పరివర్తన రావటానికి మన హిందూ ధర్మంలో అనేక సూక్తులు శ్లోకాలు ఉంచబడినయని అన్నారు. ఇవాళ మన హిందూ ధర్మాన్ని పాటిస్తు..సకల మానవాళి యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఆంజనేయస్వామి లోక రక్షకుడిగా పేరుందన్నారు. బిక్ష కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భజన కార్యక్రమం స్థానికులను ఎంత ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నియోజకవర్గంలోని బి ఆర్ ఎస్ నాయకులు, హనుమాన్ దీక్ష భక్తులు తదితరులు పాల్గొన్నారు