
పయనించే సూర్యుడు న్యూస్ :తెలుగు తెరపై తనదైన నటన, గ్లామర్‌తో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె . వరుసగా రెండు విజయాలతో ఆమె కెరీర్ ఊపందుకుంది. అయితే ఆ తరువాత ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో తెలుగులో ఈ భామ జోరు కాస్త తగ్గింది.చాలా మంది చిన్న వయసులోనే హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. అలా వచ్చి ఇప్పుడు సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. పిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది . కేవలం 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమె అందరూ హీరోలకు ఆమె ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరోలందరూ ఆమెనే మొదటి ఛాయిస్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసిన ఆమె పేరే వినిపిస్తుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? సినిమాల్లో హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తోనూ అదరగొడుతుంది. ఇంతకూ ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?ఆమె అందం, అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. క్యూట్ ఎక్స్ ప్రేక్షన్స్ కు పెట్టింది పేరు ఆ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు లేటెస్ట్ సెన్సేషన్, డాన్సింగ్ క్వీన్ శ్రీలీల. 2017లో కిస్ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తుంది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారింది శ్రీలీల. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్, గుంటూరు కారం రీసెంట్ గా మాస్ జాతర చిత్రాల్లో నటించింది.వీటిల్లో గుంటూరు కారం, భగవంత్ కేసరి బాగా ఆడాయి. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తుంది ఈ బ్యూటీ. అలాగే రీసెంట్ గా పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ఇటీవలే విడుదలైన జూనియర్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. స్పెషల్ సాంగ్స్ గురించి ఆసక్తికర సమాధానం చెప్పింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం పై ఆసక్తికర విషయం బయట పెట్టింది. ఇండస్ట్రీలో అందరూ నన్ను డాన్సర్ గానే చూస్తున్నారు. పుష్ప 2లో చేసిన ఐటమ్ సాంగ్ మీ కెరీర్‌పై ఎఫెక్ట్ చూపిందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. “అవును, ఆ సినిమా నా కెరీర్‌పై ప్రభావం చూపింది. అలాంటి పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం నాకు గర్వకారణం. కానీ ఇలాంటి ఐటమ్ సాంగ్స్ వేరే సినిమాల్లో మాత్రం చేయను. ‘పుష్ప 2’ సినిమా వేరు. అల్లు అర్జున్, సుకుమార్ వంటి టాలెంటెడ్ టీమ్‌తో పనిచేయడం ఒక స్పెషల్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.