పయనించే సూర్యడు //జనవరి 27//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ తాళ్లపల్లి శ్రీనివాస్లు గౌడ్ కి రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్నారు. శ్రీనివాసులు ఇంతకుముందు వరంగల్ ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ గా పని చస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాను నాటు సారాయి, కల్తీ మద్యాన్ని అరికట్టడంలో విశేషంగా ప్రతిభ కనబరిచారు. దీంతో ఆయనను రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారం క రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ కమలహాసన్ రెడ్డి ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసి అందజేశారు. దీంతో ఆదివారం ప్రముఖ మద్యం వ్యాపారులు గూడూరి ప్రభాకర్ రెడ్డి రాజేశ్వరరావు తోపాటు పలువురు గీత కార్మిక సంఘాల నాయకులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, ఎక్సైజ్ సీఐని కలిసి పుష్ప గుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
హుజురాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ కి రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రతిభ పురస్కారం..
RELATED ARTICLES