
- హుజురాబాద్ లో పలు శుభకార్యలకు హాజరు
పయనించే సూర్యడు // మార్చ్ // 3 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం రోజున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక ,వావిలాల, మడిపల్లి, సింగాపూర్, బావుపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో వివిధ వివాహ, గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్నారు.మరియు హుజురాబాద్ లోని వెంకటసాయి గార్డెన్స్, ఎస్ఆర్ కన్వెన్షన్, మధువని గార్డెన్స్, బీఎస్ర్ గార్డెన్స్, వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం, ఏంఆర్ కన్వెన్షన్, లలో జరిగిన పలు వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.అలాగే పెద్దపాపయ్యపల్లి, సింగాపూర్, చల్లూర్, కొత్తపల్లి, బిజిగ్గిరి షరీఫ్ గ్రామాల్లో జరిగిన వివాహ కార్యక్రమాల్లోనూ,పాల్గొన్నారు.జమ్మికుంటలో శంకర నందన గార్డెన్స్, సువర్ణ ఫంక్షన్ హాల్, దినేష్ కన్వెన్షన్ లలో జరిగిన వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. మడిపల్లి గ్రామంలో జరిగిన రెండు శుభకార్యాల్లో, బావుపేట గ్రామంలో కొంగరి రవీందర్ కుమారుని వివాహంలో, ఎర్రగట్టుగుట్ట మిత్ర కన్వెన్షన్ లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.హన్మకొండలోని పీజీర్ గార్డెన్స్, టీవీఆర్ గార్డెన్స్, శ్రీరామ కళ్యాణ మండపం లలో జరిగిన వివాహ వేడుకల్లో హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర కన్వెన్షన్ లో హుజురాబాద్ ఏఇవో నిఖిల్ కుమార్ వివాహ వేడుకలో పాల్గొన్నారు.నిన్నటి రోజున బిజీ బిజీ గా ఉన్నారు.
