
- సామాజిక కార్యకర్త అమ్మ వెంకటేష్ యాదవ్..
పయనించే సూర్యడు // మార్చ్ // 4 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఏరియా సివిల్ ఆస్పత్రి లో వారం రోజుల క్రితం దాదాపు 17 మంది వ్యక్తులను ఎమ్ న్ ఓ లను సెక్యూరిటీ ఎక్స్ రే విభాగానికి చెందిన వ్యక్తును జిల్లా అదనపు కలెక్టర్ విధుల నుండి తొలగించడం జరిగింది.కాగా విచారణలో భాగంగా చిన్న స్థాయి సిబ్బంది తప్పే గాని పెద్ద స్థాయి అధికారుల తప్పు లేదా అని సామాజిక కార్యకర్త అమ్మ వెంకటేష్ యాదవ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు,చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వ ఆసుపత్రి కి వస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన ప్రజలు వస్తే ఈ ఆసుపత్రి లో వైద్యం చేయకపోవడం కాగా వచ్చిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తులపై చర్యలు తీసుకొని సస్పెండ్ చేశారు. కానీ ఆ వ్యక్తులు తప్పు చేశారు, అని ఏ నిర్ధారణతో వారిపై చర్యలు తీసుకున్నారు. వాటికి కారకులు ఐన సూపర్డెంట్ ,ఆర్ ఎమ్ ఓ ల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు.ఈ ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చిన వ్యక్తులను ఏ ఆసుపత్రికి తరలించారో విచారణలో తెలియలేదా లేక బాడా అధికారులు కాబట్టి వీరి పైన చర్యలు తీసుకోకుండా వదిలేసి అమాయకమైన చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తులను సస్పెండ్ చేయడం సమంజసం కాదని సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కి ఈ ఏరియా ఆస్పత్రి వ్యవహారం పైన మళ్ళీ విచారణ చేపట్టి సంబంధిత అధికారుల పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ ని కోరడం జరిగిందని తెలిపారు. ఇట్టి విషయాన్ని కాలయాపన చేసి సద్దుమణిగించే ప్రయత్నం చేస్తే విషయాన్ని రాష్ట్ర వైద్య విధానం పరిషత్ కమిషనర్ ను కలిసి దీని వెనుక ఉన్న పెద్దపెద్ద నాయకులు అధికారులు ఆడుతున్న నాటకాలపై చర్యలు తీసుకునేలా చూస్తానని, ఈ హుజురాబాద్ సమస్యను రాష్ట్ర సమస్యగా చేసి పేద ప్రజలకు న్యాయం జరిగే వరకూ ఎక్కడికైనా ఎంతవరకైనా పోరాడుతానని అమ్మ వెంకటేష్ యాదవ్ అన్నారు.
