
పయనించే సూర్యడు // మార్చ్ // 24 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
హుజురాబాద్ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీకి అధ్యక్షుల, కార్యదర్శి పదవికి ఎన్నికలు ఆదివారం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం, వాసవి కళ్యాణ మండపంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సంఘంలో మొత్తం 245 మంది సభ్యులకు గాను, 175 మంది సభ్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి చెన్నూరు సురేష్ కుమార్ మరియు ఎలాబాక కృష్ణకుమార్ పోటీ పడగా చెన్నూరు సురేష్ కుమార్ కి 103, ఎలబాక కృష్ణకుమార్ కి 67, చెల్లుబడి కాకుండా 5 ఓట్లు నమోదు అయ్యాయి. కార్యదర్శి పదవికి అనురాగ్ రోహిత్ దామెర మరియు చిట్టెంపల్లి ఉపేందర్ రావు పోటీ పడగా అనురాగ్ రోహిత్ దామెరకి 117, చిట్టెంపెళ్లి ఉపేందర్ కి 53 ఓట్లు రాగా 5 ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. దీంతో అధ్యక్షులుగా చెన్నూరు సురేష్ కుమార్, కార్యదర్శులుగా అనురాగ రోహిత్ దామెరలు ఎన్నిక అయినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. అలాగే కోశాధికారిగా భాగవతుల శ్రీకాంత్ శర్మ, ఉపాధ్యక్ష పదవికి కొదుమగుళ్ల నందకిషోర్ చార్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ఎర్రం శ్రీనివాస్, వెలగందుల సాగర్, నెల్లి లక్ష్మీపతి మరియు జయపాల్ రెడ్డిలు తెలిపారు. గెలుపొందిన వారికి ధ్రువీకరించి ఎన్నిక కాబడినట్లు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు మిగతా సభ్యులకు గాయత్రి బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
