
రెండు చోట్ల 25 వేల చొప్పున నగదు, ఐదు తులాల వెండి, ఇతర సామాను మాయం.
పయనించే సూర్యడు // ఏప్రిల్ // 1 //కుమార్ యాదవ్ (హుజురాబాద్)..
హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున ఓకే రోజు ఒకే సమయంలో రెండు చోట్ల దొంగలు తెగబడ్డారు. రెండు చోట్ల కౌంటర్లో దాచిపెట్టిన రూ 25వేల నగదు, చొప్పున మాయం చేయగా అలాగే విలువైన వస్తువులను కూడా తీసుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం హుజురాబాద్ పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ చౌరస్తాలో పోరండ్ల సమ్మయ్యకు చెందిన రాఘవేంద్ర కిరాణం అండ్ జనరల్ స్టోర్, షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణంలో చొరబడ్డ దుండగులు, కౌంటర్లోని 25వేల నగదును, ఇతర విలువైన కిరాణా సామాను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. అలాగే వరంగల్ రోడ్డులోని దేవి సిల్క్స్ పక్కన ఉండే పరమేశ్వర ఎలక్ట్రికల్ అండ్ వైన్డింగ్ దుకాణంలో, షట్టర్ తాళాలు తీసి కౌంటర్లు దాచిన రూ 30 వేల నగదు, ఐదు తులాల వెండిని, దొంగిలించినట్లు షాప్ యజమాని భగవాన్ రెడ్డి తెలిపారు. అయితే ఎలక్ట్రికల్ షాప్ వద్ద అమర్చిన సీసీ కెమెరాలు దొంగ తాళాలు తెరిచే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, మూడు గంటల 30 నిమిషాల సమయంలో చోరీ జరిగినట్లుగా సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గుర్తించారు. అలాగే అన్నపూర్ణ చౌరస్తాలోని రాఘవేంద్ర కిరాణం వద్ద రెండు గంటల 30 నిమిషాలకు చోరీ జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ప్రధాన రహదారిలో బస్టాండ్ పక్కనే కూతవీడు దూరంలో ఉండే రెండు దుకాణాలలో గంట తేడాతో రెండు చోట్ల చోరీకి తెగబడడం పలువురిని భయాందోళనకు గురిచేస్తుంది. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి సీసీ ఫుటేజ్ లను స్వాధీనం చేసుకొని దాని ఆధారంగా బాధితుల ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ పట్టణంలో ఒకేసారి రెండు చోట్ల చోరీ జరగడం ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది.
