నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్..
పయనించే సూర్యడు //25//జనవరి //హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నవ తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్మ వెంకటేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కరిక్యులం సిబిఎస్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలను దండుకుంటున్న పరిస్థితులు హుజురాబాద్ లో కనిపిస్తున్నాయన్నారు.అట్టి పాఠశాలలలో ఐఐటి మెడికల్ ఫౌండేషన్ కి ప్రభుత్వ అనుమతులు లేకపోయినా విద్యార్థులను వారి తల్లిదండ్రులను యాడ్స్ పేరిట మాయమాటలు చెప్పి అడ్మిషన్స్ చేసుకుంటున్నారన్నారు ,అడ్మిషన్ తర్వాత ఒక్కో విద్యార్థి నుండి వేలకు వేల రూపాయల ఫీజులు దండుకుంటున్నారనీ, పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనల జీవోలకు విరుద్ధంగా నడిపిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారనీ, విద్యను ఒక వ్యాపారంగా మరుస్తూ విద్యా వ్యవస్థను బ్రస్టు పట్టిస్తున్న రన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలల పైన తనిఖీలు నిర్వహించాలని, విద్యార్థులని వారి తల్లిదండ్రులని మాయ మాటలతో అడ్మిషన్స్ చేయించుకుని పబ్బం గడుపుతున్న ప్రైవేట్ పాఠశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు.