
పయనించే సూర్యుడు // ఫిబ్రవరి 6 // హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా బదిలీపై వచ్చిన సమ్మయ్య ని కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ శ్రేణులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హుజరాబాద్ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని,తెలియజేశారు.ఇ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల తిరుపతి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి సందమల్ల బాబు, మైనార్టీ నాయకులు ఇమ్రాన్,సీనియర్ నాయకులు,జమదగ్ని,కుమారస్వామి,తదితరులు పాల్గొన్నారు.