Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ బరిలో ప్రభావతి రెడ్డి!?

హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ బరిలో ప్రభావతి రెడ్డి!?

Listen to this article

రిజర్వేషన్ అనుకూలిస్తే మునిసిపల్ ఎన్నికలలో గెలుపుకు వ్యూహం?

హుజురాబాద్ పట్టణాన్ని మరో సిద్ధిపేటగా మార్చేలా మాస్టర్ ప్లాన్!

పయనించే సూర్యడు // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్// హుజురాబాద్)..

హుజురాబాద్ లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 30 వ వార్డు (విద్యానగర్) నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవాలని, చైర్మన్ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని “ప్రభావతి రెడ్డి” కుటుంబం వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. 2019లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 30 వ వార్డు జనరల్ స్థానం అయింది. అప్పటి బిఆర్ ఎస్ నాయకుడు తోట రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రభావతి రెడ్డిని కోరడంతో, తనకు మద్దతు తెలిపి పోటీలో నుండి ఆమె తప్పుకున్నట్లు తెలిపారు. బిజేపీ అభ్యర్థి చేతిపై స్వల్ప ఓట్లతో ఆయన గెలుపొందారు. కానీ ఈసారి ఎలాగైనా ఇక్కడినుండే కౌన్సిలర్ గా గెలిచి చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని ప్రభావతి రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణంలో బీఆర్ ఎస్ కు మంచి పట్టుంది. గత ఎన్నికల్లోను పట్టణంలో మెజార్టీ స్థానాల్లో సీట్లను ఆ పార్టీ సంపాదించింది. 2006లో రాజకీయ అరంగేట్రం చేసిన ప్రభావతి రెడ్డి అప్పటి మేజర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసి ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగోన్నారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థుల తరఫున పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్టీ అభ్యర్థికి మొదటి స్థానంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. దీనితో బిఆర్ఎస్ కు బలం పట్టణంలో అన్ని వార్డుల్లో పెరిగింది. ఈ కారణంగా అర్ధ బలం, అంగ బలం ఉన్న ప్రభావతి రెడ్డి గత కొద్దిరోజులుగా పట్టణంలో మకాం వేసి కౌన్సిలర్ స్థానం కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. పట్టణంలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపి వారి గెలుపుకు అన్ని రకాలుగా సహకారం అందించి, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే వ్యూహం చేస్తున్నారు. 2019 కి ముందు దమ్మక్కపేట, ఇప్పల్ నర్సింగపూర్, కొత్తపల్లి గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. మునిసిపాలిటీలో విలీనం అయినప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే జరిగింది. దమ్మక్కపేట, కేసీ క్యాంప్ ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వరంగల్ – కరీంనగర్ జాతీయ నాలుగు లైన్ల రహదారిపై పట్టణం మీదుగా వెళుతుండడం శరవేగంగా అభివృద్ధి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. దమ్మక్కపేట్ సమీపంలో నుండి వరంగల్ కరీంనగర్ హైవే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. హుజురాబాద్ పట్టణంలో తాగునీటి, సాగు నీటి ఎద్దడి ప్రతి వేసవిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్నారు. ఇందుకుగాను ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా మోడల్ చెరువును పూర్తిస్థాయిలో నింపేందుకు పైపు లైన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుని శాశ్వత నీటి ఎద్దడి నివారణకు కృషి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2006 లో సర్పంచ్ గా ఓడిన సానుభూతి, చైర్మన్ రేసులో ఉండే విధంగా పట్టణంలో అన్ని వర్గాలతో మంచి సంబంధాలు నెరిపేందుకు ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నాటి నుండి నేటి వరకు అనేక సాంఘిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురికి ఆర్థిక సాయం చేయడం, ఆపదలో ఉన్న వారినీ ఆదుకోవడం, వైద్యసాయం అందించడం వంటివి చేస్తూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. రిజర్వేషన్ ను బట్టి ప్రభావతి రెడ్డి బరిలో దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేగాక ఎలాగైనా ఈసారి కూడా హుజురాబాద్ మున్సిపల్ పై గులాబీ జెండాను ఎగురవేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహాయ సహకారాలతో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ ఎస్ నుండి కౌన్సిలర్ గా పోటీ చేస్తా : ప్రభావతి రెడ్డి రాబోయే హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని, మునిసిపాలిటీపై గులాబీ జెండాను ఎగరేస్తామని ఆ పార్టీ నాయకురాలు ప్రభావతి రెడ్డి అన్నారు. హుజురాబాద్ కేంద్రంగా ఉన్న 30 వ వార్డులో స్వల్ప ఓట్లతో గతంలో గెలిచిన వ్యక్తులను మించి మెజారిటీ సాధించి బిఆర్ఎస్ కు విద్యానగర్ ఆయూవు పట్టు అనేలా చూపిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్ ను అనుసరించి కౌన్సిలర్ గా బరిలో ఉంటామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బలమైన కేడర్ బిఆర్ఎస్ పార్టీకి ఉందని గుర్తు చేశారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు మరోసారి బిఆర్ఎస్ ని కోరుకుంటున్నారని అన్నారు. అధికార కాంగ్రెస్ దాంతో కుమ్మక్కైన బిజెపి లపై ప్రజలలో ఇటీవల నమ్మకం పోయిందన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ తన సత్తా చాటుతుందన్నారు. యువత, మహిళలు, రైతులు బిఆర్ఎస్ ని కోరుకుంటున్నారని, ముఖ్యంగా పట్టణ ఓటర్లు విద్యావంతులన్న వారంతా బిఆర్ఎస్ కి అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మునిసిపాలిటీని కైవసం చేసుకునేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తాయని అన్నారు. ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తమ పార్టీకి ఉన్నాయని, సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ప్రభావతి రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments