
పయనించే సూర్యుడు న్యూస్ 21 జనవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణ
జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవాల సందర్బంగా రాజన్నసిరిసిల్లా జిల్లా రవాణాశాఖ వారు తంగళ్లపల్లి మండలం కేసిఆర్ నగర్ నుండి బద్దెనపల్లి ,తంగళ్లపల్లి మీదుగా ఆటోరిక్షా ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా డ్రైవర్లకు డ్రైవింగ్ లో తీసుకోవలసిన నిబంధనలు తెలుపుతూ మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని,అధికవేగం డ్రైవర్ సీట్ కు ఇరుపక్కల ప్రయాణికులను కూర్చోబెట్టవద్దని, ద్విచక్ర వాహనం నడుపువారు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ మరియు కార్ లో ప్రయానించి సీట్ బెల్టు ధరించి ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కీచైన్లు బహుమతిగా అందజేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖా అధికారి వి.లక్ష్మన్, మోటారు వాహన తనిఖీ అధికారి జి వంశీదర్,సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి పృద్విరాజ్ వర్మ, కానిస్టేబుల్ ప్రశాంత్, హోం గార్డ్ ఎల్లయ్య మరియు ఐ.టి.డి.ర్. ప్రిన్సిపాల్ సిబ్బంది కెసిఆర్ నగర్ ఆటో యూనియన్ అధ్యక్షులు నాగరాజు, వాహన డ్రైవర్లు, ఓనర్లు సుమారు వందమంది ఆటో రిక్షా వాహన దారులు ర్యాలీలో పాల్గోన్నారు.