
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఈసం నరసింహారావు డిమాండ్ చేశారు, సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గొప్పలు చెప్పారని ఆచరణలో మాత్రం ఆరు గ్యారంటీలు అడ్రస్ లేకుండా పోయాయని అన్నారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని యూనివర్సిటీ భూములు వేలం వేయడం సిగ్గు చేటన్నారు, ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు,ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కడుదుల వీరన్న,కుంజ రమేష్,పూనెం స్వామి, చంద్రశేఖర్, దొడ్డ సంపత్ కుమార్, బుగ్గ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.