Saturday, February 1, 2025
HomeUncategorized*1/70 చట్టం పై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు *

*1/70 చట్టం పై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు *

Listen to this article

పయనించే సూర్యడు న్యూస్.
కొయ్యురు జనవరి 31.
రిపోర్టర్ 🙁 చల్లంగి వినోద్ )

 

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్ర పాలెం గిరిజన భవన్ వద్ద జరిగిన ఆదివాసి జే ఏ సి సమావేశంలో మండల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం లో ఉన్నత స్థాయి పదవిలో ఉంటూ 1/70 చట్టం పై సడలింపు చేయాలి అని మాట్లాడం ఎవరికి మేలు చేయడానికి గిరిజనేతరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ సడలింపు అంతే కానీ టూరిజం తో ఆదివాసీలకు ఒరిగేది ఏమీ ఉండదు.ప్రధానంగా ఈ ప్రాంతంలో బాక్సైట్ అనే ఖనిజ సంపద కోసం పేరు కే టూరిజం అసలు ఉద్దేశం బాక్సైట్. ఈ ప్రాంతం లో ఆదివాసీల జీవితాలు నాశనం అయిన పరవాలేదు కానీ ప్రభుత్వ ఆదేశాలు నెరవేర్చాలి అంటే అసెంబ్లీ స్పీకర్ గారు మా ఏజెన్సీ ప్రాంతం వైపు చూడొద్దు మాకు ఉద్యమాలు కొత్తకాదు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడే తత్వం ఈ దేశానికే నేర్పింది ఆదివాసి లే,
మా సహనం ను చేతకానితనం గా చూడొద్దు అంటూ ఆదివాసి జే ఏ సి జిల్లా నాయకులు ఎస్ అశోక్ లాల్ , నర్సి పాపారావు, అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ సూరిబాబు,పాడి లవరాజు,ఉల్లి సూరి బాబు, నర్సి కృష్ణ, కొర్రు బాబూరావు, బూమయ్య,సోమ్ నాయుడు,
తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments