
పయనించేసూర్యుడు ఏప్రిల్ 30 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిల్ అయినా విద్యార్థులు అధైర్య పడవద్దని మరల సప్లమెంటరీ పరీక్షలు రాసి పాస్ కావచ్చని సూచించారు. విద్యార్థులు మున్ముందు ఎన్నో విజయాలు సాధించాలని, అలాగే పరీక్ష ఫలితాల్లో అందరికీ ఆశించిన మార్కులు రాకపోవచ్చని, ఎవరూ నిరాశ పడొద్దని కోరారు. విద్యార్థులు తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోవద్దని, మిమ్మల్ని కళ్ళలో పెట్టి చూసుకుంటున్న మీ కన్న తల్లిదండ్రులు కన్నీరు మిగల్చవద్దని కోరారు.