
పయనించే సూర్యుడు మార్చ్ 14 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.
ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి పరీక్షలకు హాజరు కాబోవుచున్న విద్యార్థులకు కావలసిన రైటింగ్ పాడ్స్, పెన్నులు,పెన్సిల్లు, స్కేలు, షార్ప్నర్, రబ్బరు మరియు ఇతర సామాగ్రిని దాతలు పాఠశాల శ్రేయోభిలాషులు చాట్ల వీరాస్వామి వారి తల్లిదండ్రులైన చాట్ల జమలమ్మ, కోటయ్యల జ్ఞాపకార్థం విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోవు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, తాము చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.5000 రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జే సాయిబాబా, గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ చాట్ల రోశయ్య, పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.