కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఆదివాసీల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
పయనించే సూర్యుడు జనవరి 11
ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్
రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా
ఉట్నూర్ న్యూస్:- గత 10ఏళ్ళు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదివాసీల అభివృద్ధికి ఎం చేశారో చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రశ్నించారు శనివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు విహార యాత్రకు వచ్చినట్లు ఇలా వచ్చి ఆలా వెళ్లడం ఏంటని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను పూర్తిగా విస్మరించిందన్నారు ఆదివాసీ వీరుడు కుమ్రం భీం కుటుంబానికి ఎం చేశారో చెప్పాలన్నారు ఐటీడీఏలను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని అన్నారు రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులకుప్పగా మార్చరన్నారు బిఆర్ఎస్ హయాంలో అనేకమంది విద్యార్థులు చనిపోతే పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నారు కానీ కాంగ్రెస్ హయాంలో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోవడం బాధాకరమని తెలిపారు స్వార్థ రాజకీయాల కోసం దీన్ని బిఆర్ఎస్ తప్పుద్రోవ పట్టించిందన్నారు
ఆదివాసీ అభివృద్ధికి బాటలు వేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంఘాలతో సమావేశమై వారి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు విద్యార్థులకు 100శాతం ఓవర్సిస్ స్కాలర్ షిప్, ప్రత్యేక ఇందిరమ్మఇండ్లు, వ్యవసాయ రైతులకు బోర్స్, పంప్ సేట్లు,గోండి బాషాలో బోధన,ఆదివాసీ వీరుడు కుమ్రం భీం జయంతి, వర్ధంతి వేడులకలను అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు.ఆదివాసీ ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమ కారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం తెలిపిందని, ఆదివాసీల పక్షాన ప్రజా ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.