
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 3 బోధన్ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండల కేంద్రంలోని సాలుర గ్రామంలో రాబోయే వేసవి కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా కొరకు, లో వోల్టెజ్ ఇబ్బందులు లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి , సాలూర మండల్ హెడ్ క్వార్టర్ లో, పెఱిక సంగం వద్ద, బోధన్ టౌన్ -2 సెక్షన్ పరిధిలో,ఈరోజు 100 కే వి ఏ సామర్త్యం కల ట్రాన్స్ ఫార్మర్ అదనముగాకే. నగేష్ కుమార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, బోధన్,వారి చేత చార్జ్ చేయబడినది. అలాగే 3 వైర్ ల నుండి మూడు ఫేస్ ల 5 వైర్ ల లైన్ మార్పించడము జరిగింది.ఈ కార్యక్రమంలో కళ్యాణ్, ఏ ఈ, బోధన్ టౌన్ 2, నాయిని కృష్ణ, ఏ ఈ, బోధన్ టౌన్ -1, మరియు విద్యుత్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, వియోగదారులు పాల్గొన్నారు. పై 100 కే వి ఏ ట్రాన్స్ ఫార్మర్ లు చార్జ్ చేయడం ద్వారా అన్ని కేటగిరీల వినియోగదారులకు లో వోల్టెజ్ సమస్యలు లేకుండా, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకోబడినవి. పై ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసినందుకు సoబoధిత విద్యుత్ వినియోదారులు హర్షం వ్యక్తం చేసారు.