PS Telugu News
Epaper

వరద నష్ట పరిహారం వెంటనే ఇచ్చి ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా 10000 ఇవ్వాలి.

Listen to this article

చినార్కూర్ లో అంగన్వాడి కొత్త భవనం మంజూరు చేయాలని సబ్ కలెక్టర్ కి వినతి.

ప్రజలందరూ ఈ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ సూచన…

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ కూనవరం,అక్టోబర్28()

మొంథా తుఫాన్ పరిశీలన కొరకు కూనవరం మండల పర్యటనలో భాగంగా చినార్కూర్ వచ్చిన సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ని ఆదివాసీ నాయకులు,మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ని కలిసి వరదల కారణం గా 5 నెలలుగా వ్యవసాయ పనులు కూలీ పనులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని,నిత్యావసర సరుకులు కొనుక్కోవాడానికి డబ్బుకు లేక దిక్కుతోచని స్థితిలో పంచాయతీ ప్రజలు ఉన్నారని వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి నిత్యవసర సరుకులు అదేవిధంగా 25 కేజీల బియ్యం ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు తక్షణ సహాయంగా ఇవ్వాలని, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ కి నాయకులు విన్నవించడం జరిగింది.అదేవిధంగా చిన్నారుకుర్ గ్రామంలో 40సంవత్సరాల క్రితం నిర్మించిన అంగన్వాడి కేంద్రం శిధిల వ్యవస్థలో ఉందని కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాన్ని ఐటిడిఏలో పిర్యాదు చెయ్యడం. పిఓ కి ప్రత్యక్షంగా ఆ అంగన్వాడి కేంద్రాన్ని చూపించడం జరిగింది. పిఓ స్పందిస్తూ ఈ భవనానికి తక్షణమే నిధులు కేటాయించి నెల రోజుల్లో నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి ఉన్నారు.కానీ అట్టి భావన నిర్మాణాన్ని ఇప్పటివరకు మరమ్మత్తులు గాని కొత్త భవనం గాని మొదలు పెట్టలేదని,పిల్లల తల్లిదండ్రులు,పిల్లలు,బాలింతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.సబ్ కలెక్టర్ వారితో మాట్లాడుతూ ముందుగా మండల ప్రజలందరూ ఈ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులందరూ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రాంతాల ను పరిశీలించాలని అధికారులకు సూచించారు, అలాగే వరద సహాయం నెల రోజుల్లో అందే విధంగా కృషి చేస్తానని,ఈ వరద ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూస్తున్నానని అదేవిధంగా నష్టపోయిన పంట కూడా పరిహారం అదేవిధంగా ప్రభుత్వంతో కలెక్టర్ తో మాట్లాడాలని త్వరలోనే పరిహారం కూడా అందుతుందని, అలాగే చిన్నారుకు అంగన్వాడి కేంద్రాన్ని వెంటనే పరిశీలించి నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో పిఓ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెసా కార్యదర్శి కుంజా అనిల్,అధ్యక్షులు సోడే ముత్తయ్య,పెసా కార్యదర్శి బొడ్డు రమేష్, అధ్యక్షులు కారం.దారయ్య, కూటమి పార్టీల నాయకులు ఎడవల్లి భాస్కరరావు, పాయం వెంకయ్య, చెలికాని ఉమామహేశ్వరరావు, కుంజా.విజయ్, శ్యామల లింగారావు, సోడే రామకృష్ణ,ఐటీడీఏ పిఓ తో పాల్గొన్న అధికారులు స్థానిక ఎమ్మార్వో శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాధ రావు, అగ్రికల్చర్ ఆఫీసర్ దేవి, సబ్ ఇన్స్పెక్టర్ లతా శ్రీ, చిన్నార్కూర్ పంచాయితీ సచివాలయ సిబ్బంది, కార్యదర్శి రోజా, వీఆర్వో ధర్మరాజు, డి ఎ వెంకటేష్, అగ్రికల్చర్ అసిస్టెంట్ లక్ష్మణ్, సర్వేయర్ జోగయ్య వివిధ శాఖల, ఐసిడిఎస్, వెలుగు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top