
ప్రముఖ కవి కైతికాల సృష్టి కర్త గోస్కుల రమేష్ కు ఘన సన్మానం పయనించే సూర్యడు //ఫిబ్రవరి //21//హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం ప్రతిపత్తి) తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మాతృభాషా దినోత్సవం, కవితారచన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా. జి సుహాసిని అధ్యక్షత వహించి మాట్లాడుతూ..తెలుగు భాష మధురమైన భాష అని, కవితారచన ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ కు చెందిన ప్రముఖ కవి, కైతికాల సృష్టి కర్త గోస్కుల రమేష్,విచ్చేసి తెలుగు కవితా రచన ప్రాధాన్యతను, కవితా రచన మెళకువలను తెలియజేస్తూ, తాను రాసిన అనేక కవితలను వివరించారు. విద్యార్థులకు నూతన కవితా ప్రక్రియ కైతికాల గురించి తెలియజేస్తూ కైతికాల లక్షణాలు వివరించారు. కార్యక్రమ నిర్వాహకులు, తెలుగు విభాగాధిపతి ఎస్.మధు కార్యక్రమం యొక్క ఉద్దేశ్యాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తూ మాతృభాష దినోత్సవం రోజున తెలుగు కవితా రచన కార్యశాల నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, కవితా రచన సృజనాత్మకత ప్రతిభను పెంపొందిస్తుందని అన్నారు. తెలుగు విభాగ అధ్యాపకులు మధు, లక్ష్మీకాంతం, రత్నమాల, సునీత సభలో శ్రావ్యంగా కవితలను వినిపించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థుల చేత కవితలు రాయించారు. వారి చేత కవితా పఠనం చేయించారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తదనంతరం కవి గోస్కుల రమేష్ ను శాలువా, పుష్పగుచ్చం, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా. సురేష్ బాబు, అకడమిక్ కో ఆర్డినేటర్ డా. ఎం అరుణ, అధ్యాపకులు డా.లక్ష్మీ కాంతం, రామా రత్నమాల, డా.సునీత, మమత, రాజేశ్వరి, డా.సామ్యూల్, ప్రవీణ్ కుమార్, డా.సారంగపాణి, ప్రశాంతి, సుజాత, సువర్ణ, ఉదయశ్రీ, రాజిరెడ్డి, రాంరెడ్డీ, రమేష్ కుమార్, మరియు భోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.