Saturday, August 23, 2025
Homeఆంధ్రప్రదేశ్12 ఏళ్ల సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు!పదవ తరగతి విద్యార్తే హంతకుడు

12 ఏళ్ల సహస్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు!పదవ తరగతి విద్యార్తే హంతకుడు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కూకట్‌పల్లిలో 12 ఏళ్ల సహస్ర హత్య కేసు ను పోలీసులు చేదించడం తోపాటు..కీలక ఆధారాల ను వెలికి తీశారు. పదో తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ నెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లి బాలిక ఉండడం తో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్ పై రాసుకున్నాడు నిందితుడు, బాలుడు రాసుకున్న పేపర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సహస్ర ఇంట్లోకి ప్రవేశిం చడం, దొంగతనం చేయ డం, ఆపై తప్పించుకోవడం వరకు అన్నీ చీటీలో రాసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వచ్చిన ఇంగ్లీషులో రాసిన ఆ లేఖలో, సహస్ర ఇంట్లో ఉన్న ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్ళానని పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడని అధికారులు వెల్లడించారు.హత్య జరిగిన రోజు కూడా బాలుడు పోలీసుల ముందుకు వచ్చి కథలు చెప్పాడు. “సహస్ర ఇంట్లోం చి నాన్నా.. నాన్నా అని అరుపులు వినిపించాయి” అని చెప్పిన బాలుడు, మరొకరు హత్య చేసినట్లు గా అనుమానాలు కలిగిం చాడు. దీని ఆధారంగా మొదట విచారణను ఇతర కోణాల్లో కొనసాగించిన పోలీసులు, తరువాత మలుపు తిప్పారు. శుక్రవారం ఉదయం మరోసారి ఆధారాలు సేకరించడానికి ఎస్ఓటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పక్క భవనం నుంచి సులభంగా సహస్ర ఇంట్లోకి దూకవచ్చని గుర్తించారు. దీంతో పక్క భవన నివాసు లందరినీ ప్రశ్నించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీలక సాక్ష్యాలు ఇచ్చాడు.హత్య జరిగిన రోజు తన గది పక్కనే బాలుడు 15 నిమిషాలు దాక్కొని ఉన్నా డని, ముఖం గుర్తుపడుతా నని చెప్పడంతో పోలీసులు అనుమానాలు బలపడ్డా యి.అనుమానాలపై స్కూల్‌కు వెళ్లిన ఎస్వోటీ పోలీసులు బాలుడిని పక్కకు పిలిచి ప్రశ్నించారు. మొదట తనకు సంబంధం లేదని, హత్య చేయలేదని తప్పుదారి పట్టించాడు. అనంతరం బాలుడు ఇంటికి తీసుకెళ్ళి తల్లి దండ్రుల సమక్షంలో ఇంట్లో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో రక్తంతో తడిసిన దుస్తులు, కత్తి, అలాగే “మిషన్ డాన్” పేరుతో రాసుకున్న చీటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా OTTలో చూసిన సిరీస్ ప్రభావంతో హత్య, దొంగతనం, ఎస్కేప్ ప్లాన్ తయారు చేసినట్లు తెలిసింది. హత్యకు రెండు రోజుల ముందే కాగితం మీద పూర్తి “ప్లాన్ ఆఫ్ యాక్షన్” రాసుకున్న బాలుడు, గ్యాస్ లీక్ చేసి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ఛేదనలో SOT, కూకట్‌పల్లి పోలీసులు కలిసి 300 మందిని విచారించారు. దీంతో సహస్ర హత్యకు బాలుడే బాధ్యుడని పోలీసులు తేల్చారు. దొంగతనం కోసం ప్రణాళిక వేసి, సహస్రను అడ్డం వచ్చినందుకు హత్య చేసినట్లు నిర్ధారించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments