పయనించేసూర్యుడు,జనవరి 26,కాప్రా ప్రతినిధి సింగం రాజు:- కాప్రా మండల్ జమ్మిగడ్డ ప్రాంత, బి.జె.ఆర్ కాలనీలో జ్ఞానమాల టీం ఆధ్వర్యంలో..
మహాత్మ జ్యోతిరావు పూలే, డా బి.ఆర్.అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ గార్ల విగ్రహాలకు 139 వ వారం పూలమాలతో జ్ఞానమాల సమర్పించారు.గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశ అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాదులు పడిన రోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొనేందుకు యావత్ భారతావని సిద్ధమైనా రోజు. జనవరి 26,దేశ గొప్ప వారసత్వం,ప్రజాస్వామ్య విలువలు,ప్రగతిశీల,సమ్మిళిత సమాజ నిర్మాణంలో తమ అవిశ్రాంత కృషిని స్మరించుకునేందుకు పౌరులంతా ఏకతాటిపైకి రానున్నా రోజు.రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డ చరిత్రాత్మక దినం.నేటి కార్యక్రమంలో.డాక్టర్ ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరి రావు,శివ నారాయణ,గోవింద్ కాలనీవాసులు శోభా రెడ్డి, చిత్తరి జ్ఞానమాల టీం సభ్యులు.ఎస్ ఏ రహీం, నర్సింహ్మ చారి,జాషువా రాములు, దయానంద్, వెంకటయ్య, నగేష్.సాయి జ్ఞాన స్కూల్ టీచర్లు స్టూడెంట్స్ పాల్గొన్నారు.తాడూరి గగన్ కుమార్ఆర్గనైజర్,
139 వ వారం జ్ఞానమాల కార్యక్రమం. ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES