
పయనించే సూర్యుడు ఆగస్టు 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు నియోజకవర్గం లో అన్ని మండలాల్లో పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తూ, వారికి అన్నివిధాల ఎన్డీఎ కూటమి ప్రభుత్వం నిలుస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా.గురువారం నెల్లూరు సంతపేటలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని 100 మంది బాధిత కుటుంబ లబ్ధిదారులకు సుమారు రూ. 83.34 లక్షలు విలువైన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఆయా మండలాల కన్వీనర్లతో కలిసి మంత్రి అందజేశారు.అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని తెలియజేశారు. ఎన్డీఎ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బందులుపడకూడదనే ఉద్దేశంతోనే 175 నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందిస్తున్నట్లు. తెలిపారు. ప్రభుత్వ హయాంలో 2024 ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలో 381 కుటుంబాలకు 4.20 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందించి, ఆ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచినట్లు చెప్పారు. కాగా చేజర్ల మండలంలో 14 మంది లబ్ధిదారులకు 11,10,826 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. చేజర్ల గ్రామ సచివాలయంలో రావి పెంచల రెడ్డి 105343 .పాడేరు గ్రామ సచివాలయంలో గోనుగుంట సుదర్శన 60834 .పొదలకూరు అనూషకి . 35000.షేక్ మస్తానమ్మ .45000 గోనుగుంట బాలకృష్ణయ్యకి 99782 మాముడూరు గ్రామ సచివాలయంలో దేవిశెట్టి వెంకటసుబ్బయ్యకి 48694.కర్రిపోగు చిన్నయ్య కి 30541 వావిలేరు గ్రామ సచివాలయంలో గోనుగుంట రత్నమ్మ 45270.జి. కళ్యాణ్ (31800) అనంతనేని ప్రమీల .37551. నాగులవెల్లటూరు గ్రామ సచివాలయంలో కోమ్మి సింహాద్రి 2,64,498. చావా ఇందుశేఖర్ 1,20,583 ఏటూరు గ్రామ సచివాలయంలో పోలిపోగు పెంచలయ్య 42324 యనమదల గ్రామ సచివాలయంలో ఉలవ రామానాయుడు 1,43,606 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి గిరినాయుడు చేజర్ల మండలం టిడిపి అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు