
పయనించే సూర్యుడు,ఫిబ్రవరి 13,అశ్వాపురం: గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల కేంద్రంలో సేవా లాల్ సేన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సేవా లాల్ సేన మండలం అధ్యక్షులు. గుగులోత్.మోహన్ నాయక్ మాట్లాడుతూ.ఫిబ్రవరి 15 నాడు మండల కేంద్రంలోని డిసిసి బ్యాంక్ వెనుకగల మినీ సేవ ఘడ్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గద్దెలపై వెలసి ఉన్న బంజారాల కుల దైవమైన శ్రీ శ్రీ శ్రీ సద్గురు సేవా లాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి లకు సేవా లాల్ సేన కమిటీ, మరియు సేవా లాల్ ధర్మజాగన సాధువుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవా లాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా భోగ్ బండారో కార్యక్రమము జరుగును. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు ఇతరులు విచ్చేయుచున్నారు కావున బంజారా సోదర, సోదరీమణులు, నాయక్ ,కార్భారీలు,గ్రామ పెద్దలు,బంజారా ఉద్యోగులు, బంజారా విద్యార్థులు,, మండల ప్రజలు మరియు సేవాలాల్ మహారాజ్ భక్తులు, సేవా లాల్ సేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం వారు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల సేవా లాల్ సేన ధర్మజాగున అధ్యక్షురాలు లకావత్.కాంతమ్మ,సేవా లాల్ సేన ఇంచార్జి.లకావత్.బాబు నాయక్,యువజన ఇంచార్జి బానోత్.వీరభద్రం నాయక్, మహిళా మండల అధ్యక్షురాలు. జరుపుల కౌసల్య బాయ్, ఉపాధ్యక్షురాలు గుగులోత్. లలిత బాయి,సురేష్ నాయక్,రాజేష్ నాయక్,మనోజ్ నాయక్,శివ నాయక్,కుల పెద్దలు సదర్ లాల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.