
ఇసుక సొసైటీల జిల్లా అధ్యక్షుడు ఈసం.రాజు
పయనించే సూర్యుడు: మార్చి 13: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
*ఏటూరునాగారం:ఏటూరునాగారం ఐటీడీఏ ఆవరణలో ములుగు జిల్లాలోని ఇసుక సోసైటీ సభ్యులు జిల్లా కన్వీనర్ టింగ.బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమావేశాన్ని ఉద్యేసించి జిల్లా అధ్యక్షుడు ఈసం.రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చేది గిరిజన ప్రాంతంలోని గిరిజన ఇసుక సొసైటీల ద్వారానే రాష్ట్రా ప్రభుత్వం నడుస్తుందని కానీ ప్రభుత్వం ఎక్కువ లాభలను ఆర్జిస్తూ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన సొసైటీల ద్వారా కాకుండా ఓపెన్ టెండర్ ద్వారా ఇసుక తొలకాలు జరపాలని చూస్తుందని అన్నారు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలను చేసింది కాపడేదే మాయొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒకపక్క డప్పులు కొడుతూ మరోపక్క గిరిజన చట్టాలను గిరిజనులను అనిసి వేసేదొరనికి తెరలేపిందని ఇసుక సొసైటీల ద్వారా గిరిజన ప్రజలకు వచ్చే ఆదాయానికి గండి పెట్టాలని ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని స్థానిక ఆదివాసీ మంత్రి సీతక్క కూడా ప్రభుత్వం తీసుకునే ఇసుక విదానం పైన ఇప్పటివరకు ఏమాత్రం స్పందించక పోవటం చాలా బాధాకరమని ఏజెన్సీ ప్రాంతంలోని భారత రాజ్యాంగ హక్కులు చాటాలని నీరుగార్చి ఆదివాసీల సహజ వనరులను దోచుకునే ప్రయత్నం చేస్తే ఆదివాసీలు చూస్తూ ఉరుకోబోమని అన్నారు ప్రభుత్వం తీసుకురాబోయే నూతన ఇసుక పాలసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా పేసా చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానం లేకుండా స్థానిక ఆదివాసీలు ఐటీడీఏ రావటానికి ఆటకం కలిగించే విదంగా పాస్ట్ ట్యాగ్ ను తొలగించలని నిరసిస్తూ తేదీ:19/03/2025బుధవారం రోజున ఏటూరునాగారం పారెస్టు చెక్ పోస్టు కేంద్రంగా జరగబోవు ధర్నా కార్యక్రమానికి ఆదివాసీ సంఘాల నాయకులు ప్రజా సంఘలా నాయకులు ప్రతిపక్ష BRS, BJP పార్టీలు కూడా మద్దతుగా రావాలని ఈసం.రాజు కోరారు ఈకార్యక్రమంలో ఇసుక సొసైటీల సభ్యులు దబ్బకట్ల.సుమన్ నల్లబోయిన.లక్ష్మన్ రావు.లోడిగా.నర్సింగరావు. కొమురం. లక్ష్మి కాంత తాటి.విజయ్ పోశెట్టి.అనసూయ మొదలగువారు పాల్గొన్నారు.