Monday, June 9, 2025
Homeఆంధ్రప్రదేశ్1952 ట్రైబల్ పాలసీ ప్రకారం వెంటనే ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం చేయాలి.మెగా డిఎస్సి లో...

1952 ట్రైబల్ పాలసీ ప్రకారం వెంటనే ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టం చేయాలి.మెగా డిఎస్సి లో ఏజెన్సీ పోస్ట్లు మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి తో భర్తీ చేయాలి – AIAEF – AP

Listen to this article

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి జూన్ 8


చింతూరు ఐటిడిఏ వద్ద ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి చింతూరు డివిజన్ ఆధ్వర్యలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలలో 25వ రోజు తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు ప్రారంభించగా ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మడివి నెహ్రూ నేతృత్వంలో – రాష్ట్ర, ఏఎస్ఆర్ జిల్లా బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కారం రాజారావు మాట్లాడుతూ… 1950 లో భారత రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకున్న వెంటనే ఆదివాసి ప్రాంతాల పరిపాలన విధానం కోసం కేంద్రం 1952 లో నే ట్రైబల్ పాలసీని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా స్వయం పాలన స్వయం నిర్ణయ అధికారం కోసం స్థానిక ఉద్యోగాలు స్థానిక సంస్థల, రాజకీయ పదవులు స్థానిక ఆదివాసీలకే కేటాయించడం అనేది విధాన నిర్ణయం. అందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకే స్థానిక ఉద్యోగాలన్నీ కేటాయించడం జరుగుతూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఉద్యోగాలు స్థానిక ఆదివాసులకు కేటాయించే విధానాన్ని రూపొందించే కృషిని హర్షిస్తున్నాం అన్నారు. ప్రభుత్వ హామీని వెంటనే ఏజెన్సీ ఉద్యోగాల నియామక చట్టం చేసి అమలు చేయాలని, మెగాడీఏసీలోని ఏజెన్సీ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీతో భర్తీ చేయాలనే ఆంధ్రప్రదేశ్ ఆదివాసి సమాజ డిమాండ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ దీక్షలను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తోడం దేశయ్య, ఏ వి ఎస్ పి సీనియర్ నాయకులు ఊకే రాంప్రసాద్, జోడే నాగేశ్వర్రావు, కుంజా భీస్మారావు, పులి కన్నారావు, సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారం దారయ్య, ఏఎస్ఆర్ జిల్లా మహిళా ఉపాధ్యక్షులు సవలం శాంతి, జిల్లా కార్యదర్శి తోడం కోటేశ్వరరావు, మహిళా సెక్రెటరీ బాబు లక్ష్మి, సహాయ కోశాధికారి మడకం లక్ష్మణ్, మడవి సాయి, మడివి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments