
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
వేల్పుర్ మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన బుట్టి మల్లయ్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లొ చేరారు, వైద్యుల పరీక్షల అనంతరం ఈ ఆర్ సి పి స్టెంటింగ్ చేయాలని వైద్యులు సూచించగా వారి కుటుంబం వైద్య సహాయం కొరకు పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సంప్రదించగా ఆయన ఆపరేషన్ కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి (2,00,000) రెండు లక్షల రూపాయలు అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
