
పయనిం చే సూర్యుడు మే 10 నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ : ఆర్ రమేష్ టి యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియ టీ యు సి ఐ భీంగల్ మండలం, బాబాపూర్ చార్భయ్ బీడీ సెంటర్ లొ పోస్టర్ ఆవిష్కరణ, ఈ సందర్బంగా నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు,ఈ సందర్భంగా టి యు సి ఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి సంయుక్త జిల్లా,, ప్రధాన కార్యదర్శి ఆర్, రమేష్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయా యన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందన్నారు. మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ 9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఈ కార్యక్రమంలో కే,.రాజేశ్వర్ జిల్లా నాయకులు , చార్బాయ్ బీడీ ప్యాకర్స్, సత్యం, అమీర్, బాబా, లింగం,, తదితరులు పాల్గొన్నారు.