
పయనించే సూర్యుడు ఫిబ్రవరి న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ : తెలంగాణ నిజాంబాద్ జిల్లాలో బోధన్ నిజ వర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి మానాల మోహన్ రెడ్డి మరియు జిల్లా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఈనెల 24న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు వస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ లో ఉదయం 11 గంటలకు భూమా రెడ్డి ఫంక్షన్ హాల్ లో సమావేశం ఉంటుందన్నారు.కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు.కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చిన నిరుద్యోగులను విస్మరించిందన్నారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి రూ. 30 కోట్లు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ లకు ఇచ్చానని కీలక వ్యాఖ్యలు చేశారని అన్నారు.ఈ వాక్యాలు నిజమో.. కాదో వారు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ బాణాల మోహన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి,నూడ చైర్మన్ కేశవేణు తదితరులు పాల్గొన్నారు.