
పయనించేసూర్యుడు జులై 5 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
టి.సుండుపల్లి మండల పరిధిలోని రాయవరం గ్రామం కావలిపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగాఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం రాగా రూరల్ సీఐ వరప్రసాద్ ఎస్సై ముత్యాల శ్రీనివాసులు తన సిబ్బంది టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రత్యేక బృందాలుగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఆండీ గోవిందన్ ను శనివారం అరెస్ట్ చేసి 26 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి మాట్లాడుతూ అరెస్ట్ చేసిన ఆండీ గోవిందన్, విచారణలో భాగంగా వెల్లడించిన వివరాలమేరకు తమిళనాడు రాష్ట్రంలోని మరి కొందరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు తప్పించుకుపోయినట్లు వారి పై గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన కోరారు. అంతర్ రాష్ట్ర స్మగ్లర్ ను అరెస్ట్ చేయడం లో కీలక పాత్ర పోషించిన రాయచోటి డి.ఎస్పి. యం.ఆర్.కృష్ణమోహన్, రాయచోటి రూరల్ సీఐ ఎన్ .వరప్రసాద్, సుండుపల్లి ఎస్ఐ యం.శ్రీనివాసులు, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ అధికారులు సుండుపల్లి పోలీసులను జిల్లాఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో రాజంపేట ఏఎస్పి మనోజ్ రామనాథ హెగ్డే ఐపిఎస్ పాల్గొన్నారు.