
హర్యాన రాష్ట్రానికి చెందిన వ్యక్తుల అరెస్టు
పయనించే సూర్యుడు మే 25 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి వాహన తనిఖీలలో మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల 58వేల రూపాయల విలువ చేసే నిషేదిత గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు సీఐ తాటిపాముల సురేష్ తెలిపారు. శనివారం టేకులపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సురేష్, ఎస్ఐ ఏ. రాజేందర్ వివరాలు వెల్లడించారు. 24.52025న ఉదయం 11:30 గంటలకు విశ్వసనీయ సమాచారం మేరకు టేకులపల్లి పోలీసులు, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలంపాడు ఎక్స్ రోడ్ సమీపంలో గల ఎసిఎ. సులానగర్ మినిస్ట్రీ చర్చ్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎస్కార్ట్ వస్తున్న కారు నెంబర్ హెచ్ఎర్ 06బికె6032, హెచ్ఎర్ 63:7315 అను నంబరు గల ఐచర్ వ్యాస్ను ఆపి తనిఖీ చేయగా 697. 160 కిలోల ప్రభుత్వ నిషేదిత గంజాయిని గుర్తించడం జరిగిందన్నారు. 2 .3,48,58,000 ఉంటుందని తెలిపారు. ఈ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఐచర్ వ్యానులో ఉన్న ముగ్గురు వ్యక్తులను, కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు, రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి ఆ రవాణాకు ఉపయోగించిన ఐచర్, కారు, 5 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు అటవీ ప్రాంతంలో గల అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామారావు మండలం బచ్చలురు గ్రామం నుండి హర్యానా రాష్ట్రం, కురుక్షేత్ర ప్రాంతానికి అక్రమంగా ఇట్టి గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది అన్నారు. పట్టుబడిన ఆరుగురు వ్యక్తుల వివరాలు. ఎ1. సందీప్ కుమార్, ఎ2. లక్విందర్, ఎ3. అమర్ నాథ్ కుమార్, ఎ4.పవన్ కుమార్ ఎస్. రాజ్ కుమార్, ఎర్. కృషన్ కుమార్, వీరందరూ హర్యానా రాష్ట్రంనకు చెందిన వారిని తెలిపారు. అమ్మిన వ్యక్తి ఎ7.హరి ఖారా, కొనుగోలు చేసిన ఎ8. ప్రిన్స్ కుమార్ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. పట్టుబడిన ఆరుగురిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగినదని తెలిపారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టేకులపల్లి సిఐ టి.సురేష్ ఎస్పై ఎ.రాజేందర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, సిబ్బందిని ఎస్సీ, రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.