
గత సంవత్సరం కిందట అనారోగ్యంతో మృతి చెందింది.
కారుణ్య నియామకం చేపట్టాలి అంగనవాడే ఆయా నోటిఫికేషన్లో నెట్టేకల్ ఎస్సీలకు కేటాయించాలి.
ఎరుకుల రవి కుమార్, ఆదోని డివిజన్ ఎస్. ఇ./ఎస్.టి విజలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్,
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని రూరల్ రిపోర్టర్.
దాసరి నాగరాజు, S/o లేట్ దాసరి అంజినయ్య, వయస్సు 34 సం||లు, నివాసం ఇంటి నెం.2-34, ఎస్.సి. కాలని, నెట్టేకల్ గ్రామం, బైచిగేరి పోస్ట్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా నివాసి అయిన నేను తమరికి వ్రాసుకున్న అర్జీ మనవి ఏమనగా,మా అమ్మగారైన డి. గుండమ్మ W/O లేట్ దాసరి అంజినయ్య అంగన్వాడి ఆయాగా 1997 నుండి పని చేస్తు తేది:01-02-2024 నాడు మరణించినారు. మా అమ్మకి ముగ్గురు సంతానం – 1. దాసరి నాగరాజు, 2. రాఘవేంద్రమ్మ మరియు 3. శకుంతల. మా అమ్మకి నేను ఒక్కడినే కుమారుడు, నా ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు జరిగి వారి భర్తల దగ్గర కాపురం వేసుకుంటూ వున్నారు, నాకు కూడా వివాహం జరిగింది. మేము ఎస్.సి. మాదిగ కులానికి చెందినవారము. మా అమ్మ మరణానంతరం మా అమ్మ చేయుచున్న అంగన్వాడి ఆయా ఉద్యోగమును మాలో అనగా నా భార్య డి. గంగమ్మకు గాని, మా చెల్లెళ్లు అయిన రాఘవేంద్రమ్మ మరియు శకుంతల అనువారికి గాని కారుణ్య నియామకం క్రింద నియమించవలెనని గతంలో రూరల్ సి.డి.పి.ఓ. కి పలుమార్లు మేము ఆర్జి సమర్పించుకున్నాము. కాని, రూరల్ సి.డి.పి.ఓ. మాకు కేటాయించకుండా ప్రస్తుతం నోటిఫికేషన్ ద్వారా నెట్టేకల్ గ్రామంలో బి.సి.-డి- గొల్ల కులం వారికి పోస్ట్ను కేటాయించి, నియామకం చేపడుతున్నారని తెలిసినది. అందుకు మేము అభ్యంతరం తెలియజేస్తున్నాము, దయచేసి మా అమ్మ పోస్ట్ నందు కారుణ్య నియామకం క్రింద మాలో ఒక్కరికి నియమించవలెనని కోరుతున్నాను.కావున, దయగల తమరు మాపై దయయుంచి గతంలో మా అమ్మడి. గుండమ్మ నెట్టేకల్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఆయాగా పని చేస్తు మరణించినందున కారుణ్య నియామకం క్రింద నా భార్య డి. గంగమ్మకు గాని, మా చెల్లెళ్లు అయిన రాఘవేంద్రమ్మ మరియు శకుంతల అనువారికి గాని సదరు పోస్ట్ను ఇప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా తమరిని ప్రార్థిస్తున్నాను.