
కనీస వేతనం 26,000 ఇవ్వాలి.
“భారీ ప్రదర్శన -సభ “
జి. వెంకట్రాంరెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
//పయనించే సూర్యుడు// జులై 10//మక్తల్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెలో భాగంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అలాగే తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల శ్రమను దోచి పెట్టుబడుదారుల లాభాలు పెంచే విధానాలకు కేంద్ర ప్రభుత్వం తెరతీసిందని ఫలితంగా కార్మికులు శ్రమ చేయలేక ఉద్యోగాలు కోల్పోవడం లేదా ఆరోగ్యాలు దెబ్బతిని చనిపోయే ఘటనలు కూడా మున్ముందు జరిగే అవకాశం ఉందని పని ఒత్తిడి కారణంగా ఇప్పటికే చాలామంది చనిపోతున్న నేపథ్యంలో ఈ లేబర్ కోడ్ లు పూర్తిస్థాయిలో అమలయితే కార్మిక వర్గం పూర్తి వెట్టిచాకిరీ లోకి వెళుతుందని అన్నారు. ఈ సమ్మె సందర్భంగా జరిగిన ర్యాలీ,సభలకు నాయకత్వం వహించిన సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు మాట్లాడుతూ కార్మిక వర్గం ఐక్య పోరాటాల ద్వారా కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివో ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి పాటలు పాడి కార్మికులకు ఉత్సాహాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి మంజుల , ప్రాజెక్టు నాయకురాలు డి. విజయలక్ష్మి , ఎం జయమ్మ, లక్ష్మి, రామేశ్వరి, శ్రీలత, ఎన్. భాగ్యలక్ష్మి, రాధిక ఆశా వర్కర్స్ యూనియన్ పి హెచ్ సి అధ్యక్షులు గోవిందమ్మ,కార్యదర్శి అమీనా, యశోద, ఇందిరా,స్వప్న మున్సిపల్ యూనియన్ నాయకులు కర్రెం కృష్ణ,జాకీర్ ఆర్పి నాయకులు ఎన్. జ్యోతి,రాజేశ్వరి వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు శివ,ఎల్లప్ప రైతు సంఘం మండల నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
