
కార్మికుల ర్యాలీ సభ
//పయనించే సూర్యుడు// జులై 10//
సీఐటీయూ జిల్లా నాయకులు కే యం మహేందర్, గోవిందు రామకృష్ణ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా నేడు మక్తల్ నియోజక వర్గం నర్వ మండల కేంద్రములో అంబేడ్కర్ కూడలి నుండి ఎం ఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ గా వెళ్లి అక్కడ గంట పాటు నిరసన కార్యక్రమం అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ లోనీ సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల నేతలు రామకృష్ణ, కే యం మహేందర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల శ్రమను దోచి ముకేష్ అంబానీ, గౌతమ్ అదాని లాంటి బడా కార్పొరేట్, పెట్టుబడుదారులకీ లాభాలు పెంచే విధానాలకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెరతీసిందని ఫలితంగా కార్మికులు శ్రమ చేయలేక ఉద్యోగాలు కోల్పోవడం నిరుద్యోగులుగా లేదా ఆరోగ్యాలు దెబ్బతిని చనిపోయే ఘటనలు కూడా మున్ముందు జరిగే అవకాశం ఉందని పని ఒత్తిడి కారణంగా ఇప్పటికే చాలామంది చనిపోతున్న నేపథ్యంలో ఈ లేబర్ కోడ్ లు పూర్తిస్థాయిలో అమలయితే కార్మిక వర్గం పూర్తిగా వెట్టిచాకిరరిలోకి వెళుతుందని అన్నారు. ఈ సమ్మె సందర్భంగా జరిగిన ర్యాలీ,సభలకు నాయకత్వం వహించిన గోవిందు ,మహేందర్, రామకృష్ణ లు మాట్లాడుతూ కార్మిక వర్గం ఐక్య పోరాటాల ద్వారా కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లను, నూతన విద్యా విధానం 2020 చట్టం వల్ల విద్యా వ్యాపారీకరణ జరుగబోతుందని మరియు 100 రోజుల పని ఉపాధి హామీ చట్టానికి నిధులు రోజు రోజుకి కోత విధిస్తూ తూట్లు పొడిచే బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని నర్వ మండలంలో ఉన్న రైతు లు,కార్మిక , కర్షక కూలీ, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్షా, కార్యదర్శులు జమున,గిరిజా నాయకులు వనజ , భాగ్య, విజయ లక్ష్మీ, సుశీల ,లక్ష్మి, మంజుల, ఆశా వర్కర్స్ యూనియన్ పి హెచ్ సి అధ్యక్షులు పద్మా,కార్యదర్శి అంజమ్మ , నాయకులు మనెమ్మ , శివమ్మ , లక్ష్మీ, మున్సిపల్ యూనియన్ మండల కార్యదర్శి రామచంద్రి, మండల నాయకులు శ్రీను నాయకులు , ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ మండల అధ్యక్షుడు వెంకటన్న , అయ్యన్న , అంజి, నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు గోవిందు మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడీ, ఆశా , ఆయాలు, పారిశుద్ధ్య కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు…
