
నోముల భానుచందర్ పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి
పయనించే సూర్యుడు అక్టోబర్ 16 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ( జేఏసీ ) యిచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్రం సహాయ కార్యదర్శి కోరారు బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9 ని హైకోర్టు కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో లో రాష్ట్రంలో బిసి సంఘాల ఐక్యవేదికరాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో యీ రిజర్వేషన్లు చేర్చడం ద్వారా దీన్ని సాకారం చేయలని డిమాండ్ తో ఈ నెల 18 న రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చింది. న్యాయబద్ధమైన ఈ బంద్ పిలుపు కి రాష్ట్రం లోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కుల సంఘాలు మద్దతు ఇచ్చి ఐక్యంగా పాల్గొన్ని బంద్ ను విజయవంతం చేయాలని ప్రగతిశీల యువజన సంఘం PYL కోరుతున్నాది. కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయమైన డిమాండ్ ని రాజ్యాంగం లో తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చి రాష్ట్రం లో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నాం.రాష్ట్రం లో అన్ని రాజకీయ పార్టీలు శాసనసభ లో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినా ఇటు రాష్ట్ర గవర్నర్ కానీ, అటు కేంద్ర ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడం వల్ల నోటి కాడి ముద్దను లాగేసుకున్నట్లు గా బిసి ప్రజలు నేడు భావిస్తున్నారు. కాబట్టి 18 న జరిగే బంద్ కు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, సంఘాలు, సంస్థలు, మేధావులు, యువకులు, విద్యార్ధులు పాల్గొన్నాయి సంపూర్ణ మద్దతు తెలియజేయలని ఆయన కోరారు