
షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరక్టర్ త్రిప్పిశెట్టి కర్ణకర్
స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు శాలువాతో ఘనంగా కర్ణకర్ ఆధ్వర్యంలో సన్మానo
ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బీసీ కుల నాయకులు
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని బిసి రిజర్వేషన్ ను,నేడు ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాహసోపేతమైన 42% బీసీ రిజర్వేషన్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడంపై షాద్ నగర్ నియోజకవర్గo తరఫున బీసీ కుల సంఘాల నాయకులు ప్రభుత్వానికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకల్ల చెన్నయ్య, చెంది తిరుపతిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్ రాజ్ గౌడ్,అగ్గనూరి బస్వం, ఇబ్రహీం,మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కర్ణకర్ ,గ్రంథాలయ కమిటీ వైస్ చైర్మన్ నక్క బాల్ రాజ్ యాదవ్,గోద మాధవులు యాదవ్, కాంగ్రెస్ పార్టీ తాలూక బీసీ సెల్ అధ్యక్షుడు జకారం శేఖర్,బాదేపల్లి సిద్ధార్థ, జాంగారి రవి,విర్లపల్లి నర్సింహులు ఈదులపల్లి నర్సింలు,గంగనమోని సత్తయ్య,అనసూయ,గండ్రాతి సాయి తదితరులు బిసి రిజర్వేషన్ పై హర్షం వ్యక్తం చేశారు.
