
పయనించే సూర్యుడు. ఫిబ్రవరి 25. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్ తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైస్ చైర్మన్ కొండ సురేఖ గారు 8వ సమావేశం లో పాల్గొన్న రాష్ట్రవణ్య ప్రాణాల సంరక్షణ బోర్డింగ్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ గారు వివిధ అటవీ ప్రాంతాల్లో నిర్మించాలని ప్రతిపాదించిన నాలుగు మొబైల్ టవర్లు, ఇతర ప్రతిపాదనలకు సానుకూలం కవాల్ టైగర్ రిజర్వు యొక్క బఫర్ ఏరియాలో పంచాయతీ రోడ్ల నిర్మాణం కోసం సవరించిన ప్రతిపాదనలు ఆమోదం. బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ సెల్ ఫోన్ టవర్లు అంశంలో ఈ ఐదు ప్రతిపాదనపై ఎస్బీడబ్ల్యూఎల్ సమావేశంలో చర్చ.
గిరిజనుల తరలింపు ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకున్న మంత్రి సురేఖ వారిని వేరే ప్రాంతాలకు తరలిస్తే… 1/70 కింద కల్గే ప్రయోజిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? అని నిలదీత. సంబంధిత చట్ట ప్రయోజిత ప్రాంతంలోకే తరలిస్తున్నట్టు అధికారుల వివరణ. అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణాలను రక్షించే విధంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు గిరిజనులకు ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు గురించి సమావేశం లో మాట్లాడడం జరిగింది. రాత్రిపూట హెవీ వెహికిల్స్ ను అటవీ రోడ్ల నుంచి అనుమతి ఇవ్వొద్దని మంత్రి సూచన చేశారు
