
పయనించే సూర్యుడు మే 7 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీకే గంగాధర్
ఏ ఐ యూ కె ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుమ్మడి నరసయ్య. వి ప్రభాకర్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
“జాతీయ నూతన వ్యవసాయ మార్కెట్ విధానం బిల్లు”కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. గతంలో మూడు వ్యవసాయ వ్యతిరేక రైతు చట్టాలను తెచ్చిన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ దేశ రైతాంగం ఉద్యమించింది. ముఖ్యంగా పంజాబ్ ,హర్యానా, యుపి, రాజస్థాన్ – లాంటి చోట్ల ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఆందోళనలను చేశారు. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ఒక వైపు నరేంద్ర మోడీ దేశ ప్రజలందరినీ నమ్మించి మరోవైపు ఈ కొత్త చట్టం ద్వారా పాత చట్టాలను పునరుద్దించినట్టుగా అవుతుందని సిపిఐ,(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ,ఏఐయుకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు. హైద్రాబాద్,విద్యానగర్ లోని మార్క్స్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ బిల్లులో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల ప్రస్తావనే లేదని తెలిపారు. దీనివలన దేశంలో ఉండే మార్కెట్ శక్తులకు ప్రోద్బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినట్టుగా అవుతుందని తెలిపారు. ఇది రైతాంగానికి ఎలాంటి లాభం చేకూర్చదని, కేవలం కార్పొరేట్ వ్యవసాయ వ్యాపారులకు ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా యావత్ దేశ ప్రజలు మరోసారి ఉద్భవించవలసిన పరిస్థితి ఏర్పడినవని అన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి .ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటు ధరలను పొందలేక అప్పులపాలై ,ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు . కానీ ప్రభుత్వాలు రైతు శ్రేయస్సును కోరి ఎలాంటి చట్టాలు చేయటం లేదని అన్నారు. కేవలం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల్ని ఆశించి చట్టాల్ని రూపొందించడం దారుణంగా ఉందని తెలిపారు. వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాల వలన ఒకవైపు నష్టపోతుంటే ఆ సందర్భంగా పాలకుల స్పందన ఏ మాత్రం రైతులకు అనుకూలంగా ఉండటం లేదని అన్నారు. వడగండ్ల వాన ,తుఫాన్లు రైతు ఆశలను ఆవిరిచేస్తున్న సందర్భాలు ఉన్నా ,నాయకులు మాత్రం ముందుకు వచ్చి ఆదుకోలేకపోవటం శోచనీయం. నరేంద్ర మోడీ అధిలోకి రాకపూర్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని వాగ్దానం చేశారు. కానీ రైతులు వ్యవసాయం కష్టమై నష్టపోయి, వ్యవసాయానికి దూరమవుతున్నటువంటి దుస్థితి నేడు నెలకున్నదని తెలిపారు. రైతుల పంటకు కనీస మద్దతు ధరల చట్టాన్ని చేసి అమలు చేస్తే ఎంతో కొంత ఆదుకున్నట్టు అవుతుందని అన్నారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పండించిన పంటకు పెట్టుబడి తో పాటు పెట్టుబడిలో సగం ధరను కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలని అన్నారు. ఈ చట్టం కోసం పోరాడుతుంటే దానికి భిన్నమైనటువంటి విధానాల్ని బిజెపి అవలంబిస్తూ పోతున్నదని తెలిపారు. రైతులకు నష్టం తెచ్చే మూడు చట్టాల స్థానంలో వచ్చిన వ్యవసాయం మార్కెట్ నూతన పాలసీని వ్యతిరేకించవలసిన అవసరం ప్రజలందరీ పైన ముఖ్యంగా రైతుల పైన ఉంటుందని రైతులు ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు.ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మార్చి కొత్తగా ప్రజలకు లాభం అయ్యే ఎలాంటి కార్యక్రమాలను తీసుకోవడం లేదని తెలిపారు. అందరూ ఒకే తాను ముక్కలు అని రుజువు చేసుకున్నారని తెలిపారు. ఈ చట్టాలను మార్చాలని పోరాడాల్సిన అవసరం రైతులందరిపై ఉందని అన్నారు. 8 మే 2025 నాడు ఇందిరాపార్క్ దగ్గర జరిగే ధర్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతాంగం వచ్చి పాల్గొనాలని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గుమ్మడి నర్సయ్య , వి.ప్రభాకర్ వీరితోపాటు అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి .రాము
