జనం న్యూస్ జనవరి 24 అమలాపురం:- ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కంచర్ల బాబి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మరియు తాటిపాక ఆర్యవైశ్య వ్యాపార సంఘ సభ్యులు ఇటీవల రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కంకటాల రాంబాబు తాటిపాకలో శుక్రవారం ఉదయం సాలువతో సత్కరించి పూలమాలలు వేసి మెమొంటో అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబి, కోశాధికారి కంచర్ల కృష్ణమోహన్ ఉపాధ్యక్షుడు పోశెట్టి సూరిబాబు, వరదా రమేషు, మునుకోటి సూరిబాబు, గాది రామం, కంకటాల సుమంత్, వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ని సత్కరించిన జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు కంచర్ల బాబి
RELATED ARTICLES