Saturday, April 19, 2025
Listen to this article

పయనించే సూర్యుడు) (ప్రతినిధి )జనవరి 26 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం:- కరస్పాండెంట్ రెడ్డిచర్ల నాగేశ్వరావు మాట్లాడుతూ… స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సమన్యాయాలను అందించిన రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం పరిరక్షణతోనే దేశానికి భవిష్యత్తు ఉంటుందని, ఏ సమాజానికైనా, ఏ దేశానికైనా వారి రాజ్యాంగమే వారికి జీవధాతువులాంటిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 1947 ఆగష్టు 15న మనం స్వాతంత్య్రాన్ని సముపార్జించినప్పటికీ కూడా భారతదేశాన్ని సర్వసత్తాక, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యాంగ ప్రపంచ దేశాల ముందు నిలబెట్టిన విధానం మాత్రం రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా భావించాలన్నారు. 26 నవంబర్, 1949న పార్లమెంట్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా భావిస్తున్న సందర్భంలో భారత రాజ్యాంగ రచనకు అధ్యక్షత వహించిన మహనీయులు డా.బి.ఆర్. అంబేద్కర్ ను ఈ సందర్భంగా ఘనమైన స్మృత్యంజలి ఘటించాల్సిన అవసరముందని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments